దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ కిరణ్‌కుమార్
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
వార్షిక తనిఖీల్లో భాగంగా బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్ గురువారం దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలతో పాటు కీలక రికార్డులు, శాంతిభద్రతలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదులు, కేసులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని, సీసీటీఎన్‌ఎస్‌లో నమోదులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. కోర్టులతో సమన్వయంగా పనిచేసి కేసుల్లో శిక్షల శాతం పెరిగేలా కృషి చేయాలని సూచించారు.సిబ్బందితో సమావేశమైన ఏసీపీ వారి సమస్యలను తెలుసుకుని, బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై నేరాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో మందమర్రి సీఐ పి. రమేష్, దేవాపూర్ ఎస్‌ఐ గంగారం పాల్గొన్నారు.