కేంద్ర ప్రభుత్వ ప్రజా, విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కొమురవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన

కేంద్ర ప్రభుత్వ ప్రజా, విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కొమురవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి 

మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్

కొమురవెల్లి అక్షితన్యూస్ :

కొమురవెల్లి మండల కేంద్రంలో గురువారం జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశానుసారం, కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా,విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమంనిర్వహించారు. ఇటీవల పార్లమెంట్ సమీపంలో విద్యార్థులు, ప్రజాస్వామ్యపరిరక్షణ కోసంశాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తూ నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ,దేశంలో విద్యా వ్యవస్థను బలహీనపరిచే విధంగా కేంద్రప్రభుత్వంఅనుసరిస్తున్నవిధానాలుఅత్యంత బాధాకరమన్నారు.విద్యార్థులభవిష్యత్తుతో చెలగాటం ఆడుతూ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న వారిపై లాఠీచార్జ్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్నసమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం వాటిని పక్కనపెట్టి నిరసనలను అణచివేయడానికి పోలీసు బలగాలనుఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.దేశ భవిష్యత్తుకు పునాది అయిన విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసేవిధానాలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు.పార్లమెంట్ సమీపంలో జరిగిన లాఠీచార్జ్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, విద్యా వ్యతిరేక నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకొని విద్యార్థులప్రయోజనాలను కాపాడాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని, ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.ప్రజాస్వామ్యాన్నిఅణగదొక్కేప్రయత్నాలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలనిపిలుపు నిచ్చారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,వివిధ గ్రామ సర్పంచ్ లు, గ్రామ శాఖఅధ్యక్షులు,అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు,యువజన కాంగ్రెస్ నాయకులు, మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking