రైతుల దాహార్తికి తీర్చిదిద్దిన చలివేంద్రం

రైతుల దాహార్తికి తీర్చిదిద్దిన చలివేంద్రం

బోగారంలో సర్పంచ్ కునూరు సాయి కుమార్ గౌడ్ ముందడుగు

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వడ్ల మార్కెట్‌లో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు, మహిళలు, కూలీలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఎండలో కష్టపడుతున్న రైతన్నలకు తాగునీరు, విశ్రాంతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఎండల సమయంలో రైతులకు ఇది పెద్ద ఉపశమనం కలిగించనుందని గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, గోగు ప్రమీల, రమేష్ యాదవ్, నేరటి మానస, సురేష్ యాదవ్, వనం అండాలు యాదగిరి, రైతులు మారం గోపాల్ రెడ్డి, కట్ట దశరథ రెడ్డి, తొండం శ్రీనివాస్ రెడ్డి, శివరాత్రి యాదయ్య, చిరగోని పద్మ, బొడ్డుపల్లి ఉమా గ్రామపంచాయతీ సిబ్బంది, కారోబార్ గోగు మహేష్ తదితరులు పాల్గొన్నారు 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking