“సురక్షితంగా చేరండి” కార్యక్రమం మూడవ రోజు… విద్యార్థుల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపు
నిర్మల్ అక్షిత బ్యూరో:–
బైంసా పట్టణంలో నిర్వహిస్తున్న “సురక్షితంగా చేరండి” రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ మూడవ రోజును పురస్కరించుకొని, చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి స్కూల్ సమీపంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం “ఏ ఎస్ పి” రాజేష్ మీనా, (ఐ పీ ఎస్) ఆధ్వర్యంలో జరిగింది. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రోడ్డు భద్రతపై మానవహారం నిర్వహించి సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. అలాగే రోడ్డు నియమాలను తప్పకుండా పాటిస్తామని ప్రమాణం చేశారు.“సురక్షితంగా చేరండి” అనే ఆకారంలో కూర్చొని ప్రత్యేక ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

