కన్న కూతురిని హత్య చేసిన తండ్రి
భువనగిరి మండలం హనుమాపురంలో దారుణ ఘటన
కూతురి గొంతు నులిమి హత్య చేసిన తండ్రి
భువనగిరి /అక్షిత న్యూస్:
భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామంలో కన్న తండ్రి తన రెండేళ్ల కూతుర్ని ఊపిరాడకుండా చేసి హత్య చేసిన దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామానికి చెందిన శ్రీరాములు నాగరాణి ఇద్దరు దంపతులు. శ్రీరాములుకి మాటలు రావు, చెవులు వినపడవు. అనంతరం వీరికి రెండేళ్ల పాప కూడా ఉన్నది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి తల్లిగారింటి వద్దే ఉంటుంది. ఉగాది పండుగ తర్వాత నుంచి తల్లి గారి నుండి వచ్చి శ్రీరాములు వద్దే ఉంటున్నది. పాత గొడవలతో భార్యపై ఉన్న కోపంతో తన రెండేళ్ల కూతురుని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్య చేసిన అనంతరం పాప మృతదేహాన్ని తల్లి నాగరాణికి వీడియో కాల్ చేసి చూపించాడు. అదేవిధంగా శ్రీరాములు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఇట్టి విషయాన్ని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.