పదేళ్లలో 15 కోట్ల సమిష్టి బోజనాలు
దశాబ్ది సంబరం విశిష్ట సేవా పయనం
శుచి..శుభ్రతతో పేదలకు పట్టెడన్నం అత్యాధునిక వంట శాల
హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
పదేళ్లలో..15 కోట్ల సమిష్టి బోజనాల మైలు రాయికి చేరింది. దశాబ్ది సంబరంలో విశిష్ట సేవా పయనం దాటుకుoది. శుచి..శుభ్రతతో పేదలకు పట్టెడన్నం వండి వార్చిoది. ఆరోబిందో ఫార్మా సహకారంతో లక్షలాది మంది ప్రజలకు పోషకాహారాన్ని అందిస్తూ ఫౌండేషన్ తన దశాబ్దకాల సేవా ప్రయాణాన్ని ఘనంగా జరుపుకుంది.హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఫౌండేషన్ అందించిన 15 కోట్ల సమిష్టి భోజనాల మైలురాయిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భోజన తయారీ సామర్థ్యాన్ని మరియు అవసరమైన వారికి పోషకాహారాన్ని అందించే ఆధునిక వంటశాల పరికరాలను ఆయన ప్రారంభించారు.హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ నర్సింగిలోని తన కేంద్రీకృత వంటశాల 10వ వార్షికోత్సవాన్ని మరియు సమాజంలోని నిరుపేదలు అవసరమైన వారికి 15 కోట్ల సమిష్టి భోజనాలను అందించిన విశిష్ట సేవా ప్రయాణాన్ని ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ మెట్రోపాలిటన్ ఏరియా మరియు అర్బన్ డెవలప్ మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిహెచ్ఎంసి సిఎంసి ప్రత్యేక అధికారి జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా వంటశాల సేవా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే ఆధునిక పరికరాలను ప్రారంభించారు. ఈ వేడుకలు హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులు మరియు అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు. -సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ (ఐఐటీ చెన్నై) వారి సారథ్యంలో జరిగాయి.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా డా. ఎం శివ కుమారన్ డైరెక్టర్ ఆరోబిందో ఫార్మా లిమిటెడ్ గౌరవ అతిథులుగా బడావత్ సంతోష్ (అదనపు కమిషనర్ జిహెచ్ఎంసి) ఎన్. రవి కిరణ్( అదనపు (కమిషనర్ జిహెచ్ఎంసి) కౌంతేయ దాస( సీఈఓ చారిటబుల్ ఫౌండేషన్) తదితర ప్రముఖులు ఫౌండేషన్ ప్రతినిధి పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ప్రారంభంలో ఫౌండేషన్ ముఖ్య ప్రతినిధులు వంటశాల మొత్తం కార్యకలాపాలను గౌరవ అతిధులకు వివరించారు. ఆధునిక సాంకేతికతతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న వంట ప్రక్రియలను సదుపాయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జయేశ్ రంజన్ అంతర్గత డిజైన్ బృందం రూపొందించిన ఆటోమేటెడ్ తయారీ యంత్రం మరియు వెసెల్ సీలింగ్ యంత్రాన్ని ప్రారంభించారు.అనంతరం వంటశాల సిబ్బంది మరియు వాలంటీర్లతో ముచ్చటించి సమాజ సేవలో వారి అంకితభావాని అభినందించారు.పోష కాహార పంపిణీ ద్వారా సాంకేతికత సామర్థ్యం మరియు కరుణను సమన్వయం చేస్తూ సమాజానికి సేవలందిస్తున్న ఫౌండేషన్ కృషిని ఆయన ప్రశంసించారు. అనంతరం హైదరాబాద్ వ్యాప్తంగా లబ్దిదారుల ప్రతిరోజూ వేడి మరియు పోషకాహార భోజనాలను తీసుకెళ్లే ఆహార పంపిణీ వాహనాలకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు.




