ఈనెల.చివరి వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంచాలి..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి..
ఇంకా 603, లక్షల మంది సభ్యుల నమోదు పెండింగ్, డీలర్లతో సమీక్ష సమావేశం..
మేడ్చల్, అక్షిత బ్యూరో:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రేషన్ కార్డుదారుల ఈ కేవైసీ నమోదు ప్రక్రియను జూలై 31 లోగా పూర్తి చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఆదేశించారు, కమిషనర్ ఆదేశాల ప్రకారం, రేషన్ కార్డు దారుల మరియు వారి కుటుంబ సభ్యుల ఈ-కేవైసి ప్రక్రియను 100% పూర్తి చేయడానికి చివరి తేదీ జూలై 31-07-2026 గా నిర్ణయించబడింది. డీలర్ల సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా, మీరు మీ పరిధిలోని లబ్ధిదారులకు ఈ సమాచారాన్ని స్పష్టంగా తెలియజేయాలి.ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి రేషన్ డీలర్లు మరియు కార్డుదారులు అనుసరించాల్సిన ముఖ్యమైన వివరాలు కింద ఇవ్వబడ్డాయి
లబ్ధిదారులకు డీలర్లు చెప్పవలసిన ముఖ్య విషయాలు..
గడువు తేదీ జూలై 31 లోపు కార్డులో ఉన్న సభ్యులందరి ఈ-కేవైసి,ఖచ్చితంగా పూర్తి కావాలి.సభ్యులందరూ రావాలి: రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా రేషన్ షాపునకు వచ్చి వేలిముద్రలు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది.కొత్త సభ్యులు కూడా: కార్డులో కొత్తగా చేరిన పిల్లలు లేదా ఇతర సభ్యులకు కూడా ఈ-కేవైసి తప్పనిసరి. రేషన్,ఈ,కేవైసి పూర్తి చేసే విధానంఆధార్ & రేషన్ కార్డు: లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు నంబర్లను సిద్ధంగా,ఉంచుకోవాలి.పోర్టబిలిటీ సదుపాయం లబ్ధిదారులు తమ సొంత ఊరిలో లేకపోయినా,ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలోని ఏ రేషన్ షాపులోనైనా ఈ-కే.వై.సి పూర్తి చేసుకోవచ్చు.డీలర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలుమీ పరిధిలో రేషన్ తీసుకుంటున్న ప్రతి కుటుంబానికి ఈ సమాచారం అందేలా చూడండి. మరణించిన వారి పేర్లు లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారి వివరాలను గుర్తించి, ఆవివరాలను 18.7.2026 లోగ ఇవ్వండి.గడువు సమీపిస్తున్నందున షాపుల వద్ద రద్దీ పెరగకుండా ముందస్తుగా టోకెన్లు లేదా సమయాలను కేటాయించుకోవడం మంచిది.ఈ 100% ఈ- కే.వై.సీ లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయడానికి లబ్ధిదారులందరినీ త్వరగా రేషన్ షాపులకు రమ్మని సూచించండి.
