ఘనంగా రిపోర్టర్ మాధగోని జంగయ్య జన్మదిన వేడుకలు
ఆరుట్ల మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో
ప్రజా సమస్యలపై పోరాటంచేసే గొప్పనాయకుడు
నిజాన్ని నిర్భయంగా వ్రాసే రిపోర్టర్
మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి రాజు గౌడ్
ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చెరుకు నరసింహగౌడ్.
రంగా రెడ్డి అక్షిత బ్యూరో :
మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో గురువారం రాత్రి రిపోర్టర్ వైయస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆరుట్ల గ్రామం మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి రాజుగౌడ్ ఇందిరమ్మ కంటిసభ్యుడు చెరుకు నరసింహగౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ కార్యదర్శి చిందం శ్రీశైలం సీనియర్ నాయకుడు గుడ్డిమల్ల చంద్రయ్య ముదిరాజ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శాలువాలతో ఘనంగా సన్మా నించి శుభాకాంక్షలు తెలుపుతూ వైయస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మాడుగుల బాలమణి కృ ష్ణగౌడ్ మొర్రిపద్మ ఐలయ్య లాలగారి మణెమ్మ నూతనగంటి శేఖర్ వైయస్సార్ మాధగోని జంగ య్యగౌడ్ ను శాలువతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మహాల క్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి రాజుగౌడ్ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చెరుకు నరసింహగౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యదర్శి చిందం శ్రీశైలం మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకుడిగా ప్రజాసమస్యలపై ఎల్లప్పుడూ పోరాటం చేసే గొప్ప నాయకుడు రిపోర్టర్ గా నిజాన్ని నిర్భ యంగారాసే గొప్ప రిపోర్టర్ వైయస్సార్ మాధగోని జంగయ్య గౌడ్ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఉంటూనే రాజకీ యాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల వార్తలు ప్రజా సమ స్యలపై ఎప్పటికప్పుడు వార్తలు వ్రాస్తూ రిపోర్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి వైయస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ అని అన్నారు.రాబోయే రోజుల్లో రిపోర్టర్ గా ఇంకా ఎదగాలని,రాజకీయంగా కూడా ఎదగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు బుట్టి కృష్ణ ముదిరాజ్, కంబాలపల్లి బుగ్గరాములు, మార లక్ష్మణ్, కోరే బాబు,యూత్ కాంగ్రెస్ నాయకుడు దూసరి రాజు గౌడ్, మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ సభ్యులు నూతనగంటి కృష్ణ, మాడపాకుల యాదగిరి పల్లె శ్రీనివాస్ గౌడ్, ఎన్నుదుల సురేష్,ఆమంచ సంతోష్,మాడపాకుల కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.