నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న శ్రీ రాగా పాఠశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
కొత్తగూడెం అక్షిత న్యూస్
శ్రీ రాగా పాఠశాల ప్రభుత్వం నిర్దేశించిన విద్యా శాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూన్నారు పాఠశాల ఎదుట పిడిఎస్ యూ,పిడిఎస్ యూ, డిఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షులు బుర్ర వీరభద్రం, పిడిఎస్ యూ జిల్లా కార్యదర్శి దుర్గం ప్రణయ్, డీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయికుమార్, కోశాధికారి గుగులోత్ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ పాఠశాలకు చట్టబద్ధమైన షిఫ్టింగ్ అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నారనీ, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తుండటంతో ఇప్పటికే ఆర్జేడి షిఫ్టింగ్ అనుమతులను తిరస్కరించాలని, ఇప్పటికీ ఎటువంటి అనుమతులు తీసుకోలేదని, గత మూడు సంవత్సరాలుగా తప్పుడు పద్ధతుల్లో నిర్వహిస్తున్నారని, అర్హత కలిగిన ఉపాధ్యాయులు పాఠశాలలో లేరనీ, అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ అనర్హులతో పాఠాలు చెప్పిస్తున్నారనీ, విద్యార్థుల ఆరోగ్య భద్రత మరియు చదువుల ప్రమాణాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం తీవ్రమైన విషయమనీ అన్నారు.అంతేకాకుండా, కొంతమంది విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడుతున్నారనీ, బహిరంగంగా మత్తు పదార్థాలు తీసుకుంటున్నా పాఠశాల యాజమాన్యం వాటిని అరికట్టేందుకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించేందుకు తగిన చర్యలు తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, వారి ఆరోగ్యం, భద్రత విషయంలో యాజమాన్యం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠశాలను నిర్వహించడం విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య అనీ, విద్యాశాఖ అధికారులు వెంటనే శ్రీ రాగా పాఠశాలపై సమగ్ర విచారణ జరిపి, షిఫ్టింగ్ అనుమతులు, ఉపాధ్యాయుల అర్హతలు, భద్రతా ప్రమాణాలు మరియు విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించాలన్నారు. పాఠశాల కేంద్రంగా అక్రమ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అమ్మకాలు, అనుమతులు లేకుండా హాస్టల్ నిర్వహణ తీరును అధికారులు సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని కోరారువిచారణలో నిబంధనల ఉల్లంఘనలు నిజమని తేలితే, సంబంధిత యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుని, విద్యార్థుల విద్యకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు అరుణ్, ఉదయ్, జీవన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.