ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సాకుతో టీ.సీ. నిలిపివేత..?

ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సాకుతో టీ.సీ. నిలిపివేత..?

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని ఆశ్రయించిన విద్యార్థిని

కొత్తగూడెం అక్షిత న్యూస్

ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇంకా విడుదల కాలేదనే కారణంతో ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీ.సీ.) ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కొత్తగూడెంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాలపై విద్యార్థిని జంపాల తేజస్విని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారికి శుక్రవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు వివరాల ప్రకారం తేజస్విని 2024–26 విద్యా సంవత్సరంలో కృష్ణవేణి జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు కళాశాలకు ఇంకా అందలేదని చెబుతూ యాజమాన్యం తనకు టీ.సీ. ఇవ్వకుండా నిరాకరిస్తోందని ఆమె ఆరోపించింది. పలుమార్లు కళాశాల అధికారులను సంప్రదించినప్పటికీ సానుకూల స్పందన రాలేదని పేర్కొంది. ఉన్నత విద్యలో ప్రవేశాలకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ అత్యంత కీలకమైన పత్రం కావడంతో వెంటనే టీ.సీ. అందేలా చర్యలు తీసుకోవాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న కళాశాల యాజమాన్యంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని విద్యార్థిని కోరింది.ఈ ఫిర్యాదుపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కళాశాల యాజమాన్యం దీనిపై ఏమి వివరణ ఇస్తుంది? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking