యాదాద్రి దేవస్థాన బోర్డు సభ్యుడు, మహిళా కమిషన్ సభ్యులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘన సన్మానం
రాయపర్తి అక్షిత ప్రతినిధి
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బోర్డు సభ్యుడిగా నియమించిన డాక్టర్ లక్ష్మీనారాయణతో పాటు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన నునవాత్ రాధా భాయ్, చిట్యాల శ్వేత, శంకరమ్మలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ పట్ల అంకితభావంతో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ లక్ష్మీనారాయణ యాదాద్రి దేవస్థాన బోర్డు సభ్యుడిగా నియామకం ఆధ్యాత్మిక రంగానికి మరింత సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే మహిళా కమిషన్ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన నునవాత్ రాధా భాయ్, చిట్యాల శ్వేత, శంకరమ్మ మహిళల హక్కుల పరిరక్షణ, సాధికారత కోసం సమర్థవంతంగా పనిచేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సన్మానం అందుకున్న డాక్టర్ లక్ష్మీనారాయణ, మహిళా కమిషన్ సభ్యులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ, తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.