రహదార్లకు మహర్దశ
తాండూరు–కోటపల్లి హైవే అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తాండూరు, అక్షిత ప్రతినిధి :
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో తాండూరు–కోటపల్లి హైవే అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. మొత్తం రూ.345.88 కోట్ల వ్యయంతో 143.53 కిలో మీటర్ల పొడవున చేపట్ట నున్న 8 హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల నిర్మాణ పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు.
మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కలెక్టర్, ఎస్పీతో కలిసి అంతారం వద్ద శంకుస్థాపన చేశారు.