రామన్నపేట–వేములకొండ ఆర్టీసీ బస్సు ను శ్రీ మత్స్యగిరి లక్ష్మీనారసింహస్వామి దేవాలయం వరకు పొడిగించాలి
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట–వేములకొండ మధ్య నడుస్తున్న ఆర్టీసీ బస్సు సర్వీసును శ్రీ మత్స్యగిరి లక్ష్మీనారసింహస్వామి దేవాలయం వేములకొండ గుట్ట వరకు పొడిగించాలని స్థానిక ప్రజలు, భక్తులు కోరుతున్నారు. దేవాలయానికి ప్రతిరోజూ పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుండగా, నేరుగా బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.బస్సు సర్వీసును దేవాలయం వరకు పొడిగిస్తే భక్తులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రజలకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు సులభంగా దేవాలయానికి చేరుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యేలు నకిరేకల్ ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి లు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, సంబంధిత ప్రజా ప్రతినిధులు స్పందించి రామన్నపేట–వేములకొండ ఆర్టీసీ బస్సును శ్రీ మత్స్యగిరి లక్ష్మీనారసింహస్వామి దేవాలయం వరకు పొడిగించేలా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.