విహారయాత్ర విషాదం.. కుబీర్ మండలానికి చెందిన ముగ్గురు మృతి

విహారయాత్ర విషాదం.. కుబీర్ మండలానికి చెందిన ముగ్గురు మృతి!

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం బోల్తా పడి ముగ్గురు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

నిర్మల్ అక్షిత బ్యూరో, కుబీర్, ఆగస్టు 31

నిర్మల్ జిల్లా కుబీర్ మండల పరిధిలోని పార్టీ–బి గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, ఇస్లాపూర్ తాలూకా సాసర్కుండు గ్రామంలో ఉన్న మహాదేవ్ మందిరాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. శ్రావణ మాసంలో భాగంగా కుటుంబ సభ్యులు మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా ఇస్లాపూర్ తాలూకా పరిధిలోని సాసర్కుండు గ్రామంలోని మహాదేవ్ మందిరానికి దర్శనం కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. దర్శనం అనంతరం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా హుడీఘాట్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.మృతులు, క్షతగాత్రులు కుబీర్ మండలం పార్టీ–బి గ్రామానికి చెందిన వారిగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. అయితే మృతుల పూర్తి వివరాలు, గాయపడిన వారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking