డైనమిక్ ఎడ్యులీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న డాక్టర్ నాగరాజు నకిరేకంటి
రామన్నపేట అక్షిత ప్రతినిధి
గ్లోబల్ ట్రింఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ది పార్క్,హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించిన వరల్డ్ బిజినెస్ సమ్మిట్ 2026,థీమ్ – ఎంపవర్,ఎడ్యుకేట్ ఎలివేట్ లో రామన్నపేట నాగార్జున స్కూల్ కరెస్పాండంట్ డాక్టర్ నాగరాజు నకిరేకంటి ‘డైనమిక్ ఎడ్యులీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ జంగం సునీల్ కుమార్ రీజినల్ డైరెక్టర్ సీబీఎస్ఈ హైదరాబాద్ రీజియన్,ఐ ఎఫ్ ఎస్ చేతుల మీదుగా అందుకున్నారు అని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ విద్యారంగంలో విశిష్ట సేవలకు, విద్యార్థులకు నైతిక విలువలు పెంపు,సమాజాభివృద్ధి వైపు అడుగులు వేసేలా కృషి చేస్తున్నందుకుగాను ఈ అవార్డు అందుకున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఈ.పురుషోత్తం జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ స్కిల్ బేస్డ్ విద్యాబోధన దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అలాగే విద్యార్థులకు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాలు పొందేలా స్కిల్స్ పెంపొందించాలని సూచించారు.


