విద్యుత్ సరఫరాలో అంతరాయం
33 కేవీ లైన్ పనుల నేపథ్యంలో ముందస్తు సమాచారం
ఏఈ యం. కోటేశ్వరరావు
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట 132 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో 33 కేవీ లైన్ పనులు చేపడుతున్నందున గురువారం సెప్టెంబర్ 3న విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏఈ యం. కోటేశ్వరరావు తెలిపారు.
లక్ష్మాపురం, తుమ్మలగూడెం సబ్‌స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ 11 కేవీ ఫీడర్లకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. అదేవిధంగా రామన్నపేట పట్టణ కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ వెల్లడించారు.
వ్యవసాయ మోటర్లకు రాత్రి నుంచి సరఫరా
వ్యవసాయ వినియోగదారుల సౌకర్యార్థం సెప్టెంబర్ 2 రాత్రి 12 గంటల నుంచి సెప్టెంబర్ 3 మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యవసాయ మోటర్లకు విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటుందని తెలిపారు. విద్యుత్ శాఖ చేపడుతున్న పనులకు వినియోగదారులు సహకరించాలని ఏఈ యం. కోటేశ్వరరావు కోరారు.