తప్పిపోయిన బాలుడు.. పోలీసుల చొరవతో తల్లిదండ్రుల చెంతకు
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
అమ్మ గార్డెన్ చౌరస్తాలో తప్పిపోయిన బాలుడిని పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో బాలుడు చౌరస్తాలో కనిపించడంతో స్థానికులు వెంటనే డయల్ 112కు సమాచారం అందించారు. దీంతో రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన బ్లూకోట్స్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని బాలుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.బాలుడిని విచారించగా మందమర్రి దొరల బంగ్లా ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. విషయాన్ని ఎస్సై జె. శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బాలుడిని క్షేమంగా అప్పగించారు.సమయస్ఫూర్తితో స్పందించిన స్థానికులు, డయల్ 112 సిబ్బంది, బ్లూకోట్స్ పోలీసులు, ఎస్సై జె. శ్రీధర్‌ను పలువురు అభినందించారు. పిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని రామకృష్ణాపూర్ పోలీసులు సూచించారు.