సెప్టెంబర్ 10న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
జేఏసీ చైర్మన్ ఊటు యశ్వంత్, కన్వీనర్ డా. రామారావు
రంగారెడ్డి అక్షిత బ్యూరో :సెప్టెంబర్ 10న జరిగే చలో హైదరాబాద్ పోస్టర్ ను తెలంగాణ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి , రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఐ డి ఓ సి , కొంగరకలాన్‌లో ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా టీజీఈజాక్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ యశ్వంత్ మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ కార్యాచరణలో భాగంగా 10న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా ఉద్యోగస్తులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా టీజీఈజాక్ కన్వీనర్ డాక్టర్ రామారావు మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వం అధికారము లోకి వచ్చిన 6 మాసాలలో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయమని ప్రభుత్వాన్ని కోరారు. సెప్టెంబర్ 10న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, నాలుగవ తరగతి ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు అందరూ ఐక్యంగా ముందుకు వచ్చి, తమ నిరసనను బలంగా వినిపిద్దామని తెలియజేసి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు,ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని సెప్టెంబర్ 10 లో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వినర్ యమ్. శ్రీను, కో చైర్మన్లు గోపాల్, రమేష్, డేవిడ్, గోపాల్ జి, శాంతి శ్రీ, వైస్ చైర్మన్లు నూతనకంటి వెంకట్, సైదమ్మ, రాకేష్, జమ కుశాల్, మల్లారెడ్డి, రంగయ్య,గోపాల్, వెంకటస్వామి, పరమేష్ , మహేష్, సంతోష్, ప్రమీల, రాణి, అరుణ తదితరులు పాల్గొన్నారు.