వ్యక్తి ఆత్మహత్య

వ్యక్తి ఆత్మహత్య

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

వివాహ సంబంధాలు పలుమార్లు విఫలమవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రామకృష్ణాపూర్‌లోని భగత్‌సింగ్‌నగర్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన పిన్నింటి మహేందర్‌ (39) ప్రైవేట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మద్యపానానికి అలవాటుపడిన ఆయనకు వివాహ సంబంధాలు పలుమార్లు విఫలమయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి వివాహ విషయం, ఆస్తి తన పేరుపై బదిలీ చేయాలనే అంశంపై తల్లిదండ్రులతో గొడవ జరిగినట్లు పేర్కొన్నారు. అనంతరం ఇంటి ముందు షెడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి బుచ్చిరాజయ్య ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking