మల్లారెడ్డి అంటే ఏంటో సినిమా చూపిస్తా

*అందరికి మల్లారెడ్డి అంటే ఏంటో సినిమా చూపిస్తా !*

మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

మేడ్చల్, అక్షిత ప్రతినిధి:

మల్లారెడ్డి మెత్తగా ఉన్నాడు అని అందరూ అనుకుంటున్నారు కానీ అందరికి సినిమా చూపిస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన కు వ్యతిరేకంగా శామీర్ పేట్ మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద బిఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడిన మాటలకు కౌంటర్ గా ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి మెత్తగా ఉన్నాడని అనుకోవద్దని అందరికి సినిమా చూపిస్తా అని మేడ్చల్ మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా లో ఉన్న మూడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ మల్లారెడ్డి చుక్కలు చూపించాడని తెలిపారు. మాటలు మాట్లాడగానే కాదని అందరికి ఈ మల్లన్న సినిమా చూపిస్తా అని ఎమ్మెల్యే హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద పెద్ద లీడర్లు వచ్చి బిఆర్ఎస్ ను ఓడగొట్టాలని కోట్ల డబ్బులు పంచారని కానీ వారి ఆలోచలను తిప్పికొట్టేలా బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ సినిమా చూపిస్తానని హెచ్చరించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ పేరుతో ప్రజల భూములకు సంకెళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

22ఏ ను రద్దు చేయాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మూడు చింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాము రవి, మాజీ ఎంపీపీ ఎల్లుభాయి, మాజీ జెడ్పీటీసీ అనిత, తూంకుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వర్ రావు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు జహంగీర్, శ్రీనివాస్ రెడ్డి, కేతమ్మ, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking