నకిలీ బీడీల ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలి…..!
బ్రాండ్ పేర్లు, ట్రేడ్‌మార్క్‌లను కాపీ చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు…!
ఆర్మూర్, అక్షిత ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌లోని ఆర్డీ పటేల్ 43 బీడీ కంపెనీకి చెందిన 43 బీడీ, తాజ్ బీడీ బ్రాండ్ పేర్లు, ప్యాకెట్లు, ట్రేడ్‌మార్క్‌లను కాపీ చేసి నకిలీ బీడీలు తయారు చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి.
ఎడపల్లికి చెందిన మాతా ట్రేడర్స్ నిర్వాహకులు శ్రీనివాస్ ముదిరాజ్ ఆత్మాల, ఆయన కుమారుడు సాయికుమార్‌పై కంపెనీ ఫిర్యాదు చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్రలోని పులగావ్, ఆర్వీ ప్రాంతాల్లో కేసులు నమోదై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొంది.
నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎడపల్లికి వెళ్లగా పరారైనట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నకిలీ బీడీల తయారీ, విక్రయాలకు అడ్డుకట్ట వేసి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీ పటేల్ 43 బీడీ కంపెనీ యాజమాన్యం కోరింది.