సీఐ శ్రీనివాసరావుకు రాయపర్తి పోలీసుల ఘన వీడ్కోలు

సీఐ శ్రీనివాసరావుకు రాయపర్తి పోలీసుల ఘన వీడ్కోలు

రాయపర్తి అక్షిత ప్రతినిధి 

సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన కొమ్మూరి శ్రీనివాసరావు బదిలీ సందర్భంగా రాయపర్తి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐ ముత్యం రాజేందర్‌ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది సీఐ శ్రీనివాసరావును శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రాజేందర్‌ మాట్లాడుతూ సీఐ శ్రీనివాసరావు విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు విశేష కృషి చేశారని అన్నారు. నేరాల నియంత్రణలో తనదైన ముద్ర వేశారని, సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉంటూ వారికి మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాయపర్తి పోలీస్‌ సిబ్బంది అందించిన ఆత్మీయ సన్మానానికి కృతజ్ఞతలు తెలిపారు. విధుల నిర్వహణలో మండల ప్రజలు, పోలీస్‌ సిబ్బంది అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాయపర్తి పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking