విలేమూన్ చౌరస్తాకు ఏకగ్రీవ తీర్మానం*

*- విలేమూన్ చౌరస్తాకు ఏకగ్రీవ తీర్మానం*

. కౌన్సిలర్ ఇర్షాద్‌కు విలేమూన్ హైస్కూల్ ఓల్డ్, స్టూడెంట్స్ ఘన సన్మానం

తాండూరు, అక్షిత ప్రతినిధి:

మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో విలేమూన్ స్కూల్ సమీపంలోని చౌరస్తాకు **‘విలేమూన్ చౌరస్తా’గా పేరు ఖరారు చేస్తూ, మున్సిపల్ కౌన్సిల్, సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడం పట్ల విలేమూన్ హైస్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ హర్షం వ్యక్తం చేశారు.

 

చౌరస్తాకు పాఠశాల పేరు ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించిన 7వ వార్డు కౌన్సిలర్ షేక్ ఇర్షాద్ అహ్మద్,ను గురువారం పాఠశాల , ఓల్డ్ స్టూడెంట్స్ ఘనంగా , సన్మానించారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిలర్ ఇర్షాద్‌ను పూలమాలలు, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా , ఓల్డ్ స్టూడెంట్స్ మాట్లాడుతూ.. తమ పాఠశాల పేరును చౌరస్తాకు పెట్టేలా కృషి చేసి, కౌన్సిల్‌లో తీర్మానం ఆమోదానికి సహకరించిన కౌన్సిలర్ ఇర్షాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల పేరుతో చౌరస్తా ఏర్పాటు కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో, జిల్లా లే లీడర్ ఏసు దాసు, ఏవి. మోజస్, ఎం. ఆనందం, పి. ధనం రాజు , జి. కవి జీవన్ కుమార్, రవికుమార్, టి. రవికుమార్, ఈ. బెన్హూర్, టి. ప్రభాకర్, రాజు, టీ. ఆశీర్వాదం, విలమున్ హై స్కూల్ విద్యార్థులు, పాఠశాల యజమాన్యం, దితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking