కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధే ధ్యేయం

కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధే ధ్యేయం

 కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్ అక్షిత బ్యూరో

45వ డివిజన్‌లో డివిజన్‌లో అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘనంగా శంకుస్థాపన  నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 45వ డివిజన్‌లో అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ నిధులతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు మరియు పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి, మేయర్ ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు నగరంలోని అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడం, నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా కాలనీవాసుల దశాబ్దాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. పనుల్లో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు లోపించకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావ్, స్థానిక కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, ఇతర డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, కాలనీ ప్రముఖులు మరియు డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking