కారు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
సేవాలాల్ తండా టీ జంక్షన్ వద్ద ప్రమాదం…
లోకేశ్వరం, ఆగస్టు 27 అక్షత న్యూస్
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల పరిధిలోని సేవాలాల్ తండా ‘టీ’ జంక్షన్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు లావ్డే కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు.లోకేశ్వరం ఎస్సై ఎల్. ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్ తండాకు చెందిన లావ్డే కుమార్, ద్విచక్రవాహనంపై వెళ్తుండగా..ధర్మోరాకు చెందిన ఎం. ప్రవీణ్‌రెడ్డి నడుపుతున్న కారు వాహన నంబర్ టీజీ 18.8998 నిర్లక్ష్యంగా,అజాగ్రత్తగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కుమార్,కు పలు గాయాలయ్యాయి.క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రదీప్ తెలిపారు తెలిపారు 