సీతమ్మ లోద్ది గుట్టలపై మందమర్రి రన్నర్స్ సాహసం

సీతమ్మ లోద్ది గుట్టలపై మందమర్రి రన్నర్స్ సాహసం

14 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌.. ఔరా అనిపించిన రన్నర్స్

గుట్టలెక్కి సత్తా చాటిన మందమర్రి రన్నర్స్

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

పెద్దపల్లి జిల్లా సబితం గ్రామపంచాయతీ పరిధిలోని గట్టు సింగారం సమీపంలో ఉన్న చారిత్రక ప్రాధాన్యత కలిగిన సీతమ్మ లోద్ది గుట్టలపై యువశక్తి ఫౌండేషన్, పెద్దపల్లి జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రెక్కింగ్‌ కార్యక్రమంలో మందమర్రి రన్నర్స్ ఆర్గనైజేషన్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 400 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో మందమర్రి రన్నర్స్ సభ్యులు 14 కిలోమీటర్ల క్లిష్టమైన ట్రెక్కింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. శాతవాహనుల కాలం నాటి చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ఎదురైన సవాళ్లను అధిగమించి తమ సాహసాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా రన్నర్స్ మాట్లాడుతూ.. ప్రకృతి ఒడిలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన సీతమ్మ లోద్ది ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణవ్యాప్తంగా నిర్వహించే మారథాన్లు, ట్రెక్కింగ్ కార్యక్రమాల సమాచారాన్ని ఆసక్తి ఉన్నవారికి అందించి, రన్నింగ్‌, వాకింగ్‌, ట్రెక్కింగ్‌పై మరింత మందికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో వ్యాయామం, రన్నింగ్‌, వాకింగ్‌ను అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మందమర్రి రన్నర్స్ సభ్యులు మూడారపు అనిల్, గుడికందుల రమేష్, రామంచ తిరుపతి, మారిశెట్టి గోపికృష్ణ, జక్కుల ప్రసాద్ గౌడ్, నేల్లి వేణు, తిప్పని శ్రీనివాస్ సురేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking