యాంటీ రేబిస్ వ్యాక్సిన్

ఆకర్షణీయంగా శునకాలు, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ను ప్రారంభించిన కలెక్టర్ పి ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ , అక్షిత బ్యూరో:

జర్మన్‌ ఫెపర్డ్‌, పొమిరేనియన్‌, గ్రేడెన్‌షిట్జు, లేబర్‌డార్‌, రెట్రైవర్‌, లెసాఫ్సో, డాబర్మెన్‌ వంటి శునకాలు ఆకట్టుకున్నాయి. జూనోసిస్‌ డే సందర్భంగా బుధవారం వివిధ రకాల పెంపుడు శునకాలనూ తీసుకొచ్చి యాంటీరేబిస్‌ వ్యాక్సిన్‌ వేయించారు. నాగర్ కర్నూలు ప్రాంతీయ పశువైద్య శాల లో ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పెంపుడు కుక్కలకు పశువైద్యలు వ్యాక్సినేషన్‌ క్యాంపెయిన్‌ నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ ను జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ ప్రారంభించారు. పట్టణంలోని పలువురు జంతుప్రేమికులు తమ శునకాలను తీసుకొచ్చి వ్యాక్సినేషన్‌ చేయించారు.
జిల్లా కలెక్టర్కు పోలీసు శునకాలు గౌరవ వందనం చేశాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు 150జూనోటిక్‌ వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశముందని, పశు, మానవవైద్యులు సమన్వయంతో పనిచేసి ఈ వ్యాధులను నియంత్రించాలని కలెక్టర్ సూచించారు.
ఈ వ్యాధులపై ప్రజల్లోనూ మరింత అవగాహన కల్పించాలన్నారు.
ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులకు యాంటీ రేబిస్ టీకాలను తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ కోరారు.
పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ మాట్లాడుతూ….
ఈ వైరస్‌ ఉన్న కుక్కలు మనుషులను, పశువులపు కరవడం వలన లాలాజలం ద్వారా సంక్రమిస్తుందన్నారు. ర్యాబిస్‌ వ్యాధి వలన ప్రపంచవ్యాప్తంగా 59 వేల మంది మరణిస్తున్నరని,
ఈ వైరస్‌ మనుషులకు, పశువులకు వ్యాప్తి చెందడంలో కుక్కలు వారధిగా పనిచేస్తుంటాయన్నారు.
చనిపోయిన ర్యాబిస్‌ వ్యాధి సోకిన పశువులను, గబ్బిలాల కళేబరాలను కుక్కలు తినడం వలన ఈ వైరస్‌ కుక్కలకు సంక్రమిస్తుందన్నారు. ఈ వ్యాధి వలన కుక్కలు మానసిక స్థితిని కోల్పోయి విచిత్రంగా ప్రవర్తిస్తాయని, ఈ వ్యాధి సోకిన కుక్కలు మనుషులను, పశువులను కరవడం వలన వ్యాధి సోకి మరణిస్తారు, ఈ వ్యాధిని మందు లేదు . ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి, పెంపుడు కుక్కలతో పాటు వాటిని పెంచేవారికి, డాక్టర్లు కూడా వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలన్నారు. ఇవే కాకుండా టుబెర్కలోసిస్,మెదడు వాపు,బద్దే పురుగులు,బ్రూసెల్లోసిస్ మొదలైన వ్యాధులు కూడా పశువుల నుండి మనుషుల కు మనుషుల నుండి పశువులకు వ్యాపిస్తాయి అని తెలిపారు.
అంతకుముందు కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ లాల్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, జడ్పిసిఓ ఉష, జిల్లా ఫిషరీస్ అధికారి లక్ష్మప్ప, డా ఆదిత్య వర్మ, డా జ్ఞాన శేఖర్ ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking