ప్రగతికి నమూనా… తెలంగాణ

అభివృద్ధి, ప్రజాసంక్షేమమే
టీఆర్ఎస్ ‘తారక’ మంత్రం

* అందరి భాగస్వామ్యంతోనే నియోజకవర్గ అభివృద్ధి

* వాడపల్లి గ్రామంలో రూ.30 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన

మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : అభివృద్ధి, ప్రజాసంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు ‘తారక’మంత్రమని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అభివర్ణించారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో వాడపల్లి గ్రామంలో ఎస్డీఎఫ్, డీఎంఎఫ్టీ నుంచి మంజూరైన రూ.30 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భాస్కర్ రావు శనివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి లో పార్టీలకు అతీతంగా అందరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో అస్మదీయులు…తస్మదీయులనే భేదాలు తమకు లేవని భాస్కర్ రావు పునరుద్ఘాటించారు.

కరోనా కష్టకంలోనూ ప్రతినెలా గ్రామాల అభివృద్ధి కోసం రూ.339 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని కొనియాడారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నదని అన్నారు. జిల్లా మంత్రికి రూ.2కోట్లు, కలెక్టర్ కు కోటి రూపాయలు, జిల్లా మంత్రి అంగీకారం మేరకు సీడీఎఫ్ (నియోజకవర్గ అభివృద్ధి నిధి) నుంచి ఖర్చు చేసేందుకు ఎమ్మెల్సీ,ఎమ్మెల్సీలకు ప్రభుత్వం అధికారాలు మంజూరు చేసిందన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు కోసం వేచి చూడకుండా పట్టణ ప్రగతిలో భాగంగా అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేసేందుకు సీడీఎఫ్ నిధులు ఉపకరిస్తాయని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని భాస్కర్ రావు అన్నారు. రెండేండ్లలో రూ.766కోట్ల 12లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు. డీఎంఎఫ్టీ ద్వారా మున్సిపాలిటీల్లో చెత్త,చెదారం సేకరణ కోసం కోటి 67 లక్షల రూపాయలతో ట్రాక్టర్లు, ఆటోలు, జేసీబీ కొనుగోలు చేసి పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో పే అండ్ యూజ్ విధానం ద్వారా రూ.72 లక్షల వ్యయంతో ఆరు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను మంజూరు చేయించానని అన్నారు. అహ్లాదాన్ని పంచే మినీ ట్యాన్క్ బండ్ నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు సరిపడకపోతే అదనంగా రూ.6కోట్లు కేటాయించినట్టు భాస్కర్ రావు తెలిపారు. కార్య‌క్ర‌మంలో జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జడ్పీటీసీ అంగోతు లలిత హాతీరాం, ఎంపీపీ నందిని రవితేజ, సీనియర్ నాయకులు యూసుఫ్, వైస్ ఎంపీపీ కటికం సైదులు రెడ్డి, సర్పంచ్ కొందూటి మాధవి సిద్దయ్య, ఉప సర్పంచ్ ఉప్పుతల శ్రీనివాస్, ఎంపీటీసీ కామేపల్లి అనంతలక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, బాల సత్యనారాయణ, గువ్వల చంద్రకళ, ముడి సునీత, నడ్డి వెంకటమ్మ, బత్తుల వీర్ల వెంకమ్మ, బాణావత్ విజయ, నాగలక్ష్మి, ఆనంద్, ఆశీర్వాదం, రఫీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking