చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు

కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉజ్వల భవిష్యత్తు

జనయేత్రి వ్యవస్థాపక అధ్యక్షులు
మునీర్ అహ్మద్ షరీఫ్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి:
ప్రతి రంగంలో తాము ఎంచుకున్న వృత్తినీ కష్టంతో కాకుండా ఇష్టంతో చేసినట్లయితే ఆయా రంగాలలో తమ భవిష్యత్తుతో పాటు సమాజ స్థితిగతులను మార్చే అవకాశం ఉంటుందని జనయత్రి వ్యవస్థాపక అధ్యక్షులు మునీర్ అహ్మద్ షరీఫ్ అన్నారు గురువారం బంగారుగడ్డకు చెందిన అర్బాజ్ ఖాన్ ఎంబిబిఎస్ పూర్తి చేసి పట్టా అందుకున్న సందర్భంగా అతనికి ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా ఉన్నత చదువులు చదవాలని అదే విధంగా సమాజంలో ధనార్జనే ధ్యేయంగా కాకుండా బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని జనయేత్రీ ఫౌండేషన్ కోరుకుంటుందని తాము చేపట్టే కార్యక్రమంలో మానవతా దృక్పధం ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రముఖ డాక్టర్లు బాలాజీ, శమియుద్దీన్, నాగు నాయక్, తులసిరాం, వికాస్ లు మాట్లాడుతూ వీలైనంతవరకు వైద్య వృత్తి సేవగా భావించి ఆరోగ్య సమాజాన్ని నిర్మించుటకు కృషి చేయాలని హితవు పలికారు. జనయేత్రీ ఫౌండేషన్ గౌరవ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, దయాకర్ రెడ్డిలో మాట్లాడుతూ ప్రేమే లక్ష్యం సేవే మార్గంగా నడుస్తున్న ఫౌండేషన్ బాటలో మనమంతా నడుస్తూ సమాజసేవ తద్వారా దేశ సేవ చేయాలని కోరారు. ఫౌండేషన్ నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోగుల సందీప్ జిల్లా కార్యదర్శి ఫహిం మాట్లాడుతూ సమాజసేవ చేయాలన్న సంకల్పo ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఫౌండేషన్ లో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం అర్బాజ్ ఖాన్ ఘనంగా శాలువాలు మెమెంటోలు జ్ఞాపకాలతో సత్కరించారు. అదేవిధంగా జనయేత్రి ఫౌండేషన్ శ్రేయోభిలాషి రాంబాబు గారి జన్మదిన సందర్భంగా వారిని జ్ఞాపకాలు కేకుతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ యాదగిరి, యజాస్, శ్రీనివాసరెడ్డి, పాపయ్య, ప్రవీణ్,రాజు,,రోహిత్, షాహీర్, కావ్య,ఉమ,నూర్జహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking