స్వాతికి భాస్కర్ రావు ప్రశంస

జప్తీవీరప్పగూడెం యువతికి డీసీసీబీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గా కొలువు
* స్వాతిని అభినందించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : మిర్యాలగూడ నియోజకవర్గంలో జప్తీవీరప్పగూడెం గ్రామానికి చెందిన యువతి క్రమశిక్షణ, కృషి, పట్టుదల, అకుంఠిత దీక్షతో సర్కారీ కొలువు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్లితే..కర్రావుల శ్రీనివాస్ రావు కుమార్తె కర్రావుల స్వాతి నల్లగొండ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (డీసీసీబీ)లో అసిస్టెంట్ మేనేజర్ కొలువుతో పాటు స్టాఫ్ మేనేజర్ గా ఎంపికయ్యారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో తుంగపహాడ్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాతి, ఆమె కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వాతి ప్రతిభ గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆమెను అభినందించారు. అతి చిన్న వయస్సులో సర్కారీ కొలువు సాధించిన ఆమెను ‘శభాష్ స్వాతి..’ అంటూ అభినందించి మిఠాయి తినిపించారు. నిజాయితీతో పని చేసి భవిష్యత్ లోనూ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్వాతిని అశీర్వదించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking