ముస్తాబైన పెద్దమ్మ తల్లి ఆలయం

శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలకు ముస్తాబవుతున్న గుడి_ బుట్టి సత్తయ్య

ఇబ్రహీంపట్నం, అక్షిత ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడ్ గ్రామంలో ముదిరాజుల కమిటీ ఆధ్వర్యంలో బుధవారము జరిగే శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి బోనాల, హోమం ఉత్సవాలలో భాగంగా , శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి గుడిని అంగరంగ వైభవంగా , కలర్ లతో, మంచి మంచి డిజైన్లతో అమ్మవారి యొక్క గుడిని , అందంగా అలంకరించడం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు బుట్టి సత్తయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ముదిరాజుల సమక్షంలో జరిగే శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ముదిరాజులము ఐక్యతతో సామరస్యంతో ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నాము. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి దీవెనలు తీసుకోవాలని ఆమె ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పసుల వినోద్ కుమార్ , ట్రెజరర్ పిట్టల శేఖర్, సభ్యులు పసుల జలంధర్, బుట్టి బుగ్గరాములు, కొరిమి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking