పోటీ పరీక్షలకు హాజరయ్యే యువకులకు నెట్ సౌకర్యం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ శాఖ గ్రంధాలయంలో ఉద్యోగ పోటీ పరీక్షలకు హాజరయ్యే యువకులకు కంప్యూటర్, నెట్ సౌకర్యాన్ని లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం.రామానుజాచార్యులు చొరవతో సోమవారం కల్పించారు. ఇటివల మిర్యాలగూడ వచ్చిన విశ్రాంత ఐఎఎస్ అధికారి చక్రపాణితో యువకుల ఇబ్బందులు తెలుసుకున్న రామానుజాచార్యులు కంప్యూటర్ రిపేర్ చేయించగా, లయన్ డాక్టర్ శ్రీనివాసరాజు సంవత్సరం నెట్ సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో లయన్స్ రీజినల్ చైర్మన్ డైమండ్ మాశెట్టి శ్రీనివాస్, లయన్ తరుణ్ క్లబ్ అధ్యక్షుడు కె.కిరణ్, లైబ్రేరియన్ కె.సుధాకర్ పాల్గొన్నారు.