ఆపద్బాంధవుడు ‘కేసీఆర్’

ఆపద్బాంధవుడు ‘కేసీఆర్’

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం

ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు


మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్ ) నిరుపేదలకు వరమని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కొనియాడారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవ్యాప్తంగా 26 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.13 లక్షల 83 వేలు విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

అనంతరం భాస్కర్ రావు మాట్లాడారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని అన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు.

సీఎం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని భాస్కర్ రావు తెలిపారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును నామినీకి అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, టీఆర్ఎస్ మిర్యాలగూడ మండల అధ్యక్షుడు మట్టపల్లి సైదులు యాదవ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ జగదీశ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking