దేశ అభ్యున్నతే కేసీఆర్ లక్ష్యం
* దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర
* మిర్యాలగూడ క్యాంపు కార్యాలయంలో బాణా సంచా కాలుస్తూ పార్టీ శ్రేణుల సంబురాలు
* యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
దేశ అభ్యున్నతే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మార్పు చేస్తూ తీర్మానం చేసిన సందర్భంగా నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో సంబురాలు అంబరాన్ని తాకాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులంతా పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంపిణీ చేశారు.

మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించిన సంబురాల్లో నల్లమోతు సిద్దార్ధ పాల్గొన్నారు. ‘ దేశ్ కీ నేత కేసీఆర్’ అని నినదించారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినందుకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభ్యున్నతిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఇప్పటికే ఎన్నారైలు సంపూర్ణ మద్దతు ప్రకటించారని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయణిస్తోందన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చేస్తూ సీఎం కేసీఆర్ చేసిన అధికారిక ప్రకటన పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపిందని, తమపై బాధ్యత మరింత పెరిగిందని నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ 21 ఏండ్లలో అబ్బురపరిచే విజయాలను కైవసం చేసుకుందన్నారు. అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుందని నల్లమోతు సిద్దార్ధ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస గౌడ్, సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ మండల అధ్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, కౌన్సిలర్ సలీం, సాధినేని శ్రీనివాస రావు, పత్తిపాటి నవాబ్, చీదల్ల శ్రీనివాస్,టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధికార ప్రతినిధి పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, మిర్యాలగూడ మండల రైతు బంధు సమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, టీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం ఉపాధ్యక్షులు యర్రమళ్ళ దినేష్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనారిటీ నాయకులు మధార్ బాబా, పునాటి లక్ష్మీనారాయణ, చాంద్ పాషా, బుర్రి శ్రీనివాస రెడ్డి, కొత్త వెంకట్, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, ఎలుగుబెల్లి నాగరాజు, నల్లగంతుల నాగభూషణం, ఇమ్రాన్, బాచి, రామావతారం, యేసు, శైలేందర్, నాగేందర్, ఫయాజ్, ఖాజా, శ్రీకాంత్, రామ రవీంద్ర వరప్రసాద్, కోల శ్యాం, తదితరులు పాల్గొన్నారు.