శ్రీనివాస్ కు సిద్దార్థ పరామర్శ

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కళాకారుడు
* శ్రీనివాస్ ను పరామర్శించిన నల్లమోతు సిద్దార్ధ

వేములపల్లి, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో వేములపల్లి మండలంలోని సల్కునూర్ గ్రామానికి చెందిన తెలంగాణ సాంస్కృతిక నల్లగొండ జిల్లా కళాకారుడు బచ్చలకూరి శ్రీనివాస్ కొద్ది రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

ద్విచక్ర వాహనం పై నుంచి జారిపడి ప్రస్తుతం వైద్య సేవలను పొందుతూ ఆయన నివాసం వద్ద విశ్రాంతి పొందుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా సమాచారం తెలుసుకున్న నల్లమోతు సిద్దార్ధ బుధవారం శ్రీనివాస్ నివాసానికి చేరుకొని పరామర్శించారు. సిద్దార్థ వెంట సర్పంచ్ అంకెపాక రాజు, ఎంపీటీసీ గడ్డం రాములమ్మ వెంకన్న, ఉప సర్పంచ్ బారి సైదులు, గ్రామ పార్టీ అధ్యక్షులు గడ్డం కృష్ణ, వార్డు మెంబర్లు గంట సైదులు, నవీన్ ఇంకా కిరణ్, బురకచెర్ల వెంకటేశ్వర్లు, తాటిచెర్ల పిచ్చయ్య, ముక్కాల వెంకన్న, అంకెపాక సైదులు, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking