*జర్నలిస్ట్ వెంకన్నకు అండగా ఉంటాం

*జర్నలిస్ట్ వెంకన్నకు అండగా ఉంటాం 

తెంజు అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

సీనియర్ జర్నలిస్ట్ వెంకన్నకు అన్ని విధాలా అండగా నిలబడతామని తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు.గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ వైద్య సేవలు పొందుతున్న విషయం తెలుసుకుని అర్వపల్లిలో వెంకన్నను కలిసి పరామర్శించారు. మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ దృష్టికి సమస్యను తీసుకెళ్లి సహాయం అందేటట్టు చూస్తానన్నారు. టీయూడబ్ల్యూజే నాయకత్వం పూర్తిగా అండగా నిలబడి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. తుంగతుర్తి నియోజకవర్గoలో ప్రధాన పత్రికల్లో సేవలు అందించిన వెంకన్నను పూర్తిగా ఆరోగ్యం చేకూరెదాకా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆయన వెంట స్థానిక జర్నలిస్టులు సుధాకర్, తులసిరామ్, బాలకిషన్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking