నూతన విద్యా విధానంతో బడుగుల చదువుకు భంగం

జాతీయ నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలి
*సిఐటియు రాష్ట్ర నాయకులు మల్లేష్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర నాయకులు డి.మల్లేష్ అన్నారు. శుక్రవారం సిపిఎం కార్యాలయంలో జరిగిన ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ ఎస్ఎఫ్ఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. నూతన విద్యా విధానంలో ఉన్నత విద్య కోర్సులలో కులవృత్తులను చేర్చి విద్యార్థులకు శాస్త్ర విద్యా విధానాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తెస్తుందన్నారు నూతన విద్యా విధానంలో శాస్త్రీయ విద్యా విధానానికి బదులుగా జ్యోతిష్యం, బుర్రకథ లాంటి కోర్సులు జోడించారన్నారు విద్యార్థులకు కావాల్సిన శాస్త్రీయ విద్యా విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి గాని పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసేంతవరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదానాయక్ ఎస్ఎఫ్ఐ టౌన్ అధ్యక్ష కార్యదర్శులు జగన్, వదుద్ మిర్యాలగూడ మండల కార్యదర్శి మనీ, అడవిదేవుల పల్లి మండల అధ్యక్షులు శ్రవణ్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ నాయకులు నుమన్, ఆకాష్, సమధ్, ఉపేందర్, తరుణ్, ఈశ్వర్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking