బిజేపి తీరు… దేశ పునాదులకు ముప్పు

హంత‌కుల స్వైర విహారం

 ఈ దేశం పునాదుల‌కే ప్ర‌మాదం

సీఎం కేసీఆర్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం, నాయ‌కుల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఈ ప్ర‌జాస్వామ్య హంత‌కుల యొక్క స్వైర విహారం చాలాచాలా ఈ దేశం యొక్క పునాదుల‌కే ప్ర‌మాద‌క‌రం అని కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం రాత్రి సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మీడియా స‌మావేశం ఏదైతో ఉందో చాలా భార‌మైన మ‌న‌సుతో దుఖంతో నిర్వ‌హిస్తున్నాను. చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఈ దేశంలో నెల‌కొని ఉన్నాయి. కానీ ఈ దేశంలో దుర్మార్గం జ‌రుగుతుంది. ప్ర‌జాస్వామ హ‌త్య నిర్ల‌జ్జ‌గా విశృంఖ‌లంగా, విచ్చ‌ల‌విడిగా కొన‌సాగుతోన్న ప్ర‌జాస్వామ్య‌ హ‌త్య . ఈ ప్ర‌జాస్వామ్య హంత‌కుల యొక్క స్వైర‌విహారం ఈ దేశం యొక్క పునాదుల‌కే ప్ర‌మాదక‌రం. అత్యంత భ‌యంక‌ర‌మైన‌ది. చాలా భాదాక‌ర‌మైన ప‌రిస్థితి. కనీసం మ‌న ఊహాకు కూడా అంద‌దు. అందుకే బాధ‌తో మాట్లాడుతున్నాను. 8 ఏండ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వ‌చ్చి దేశాన్ని అన్ని రంగాల్లో స‌ర్వ‌నాశ‌నం చేసింది. రూపాయి ప‌డిపోయింది. నిరుద్యోగం తాండ‌విస్తుంది. ఆక‌లి రాజ్యంగా మారుతోంది ఇండియా. అంత‌ర్జాతీయ సూచిక‌లు మంచి చెడును చూపిస్తున్నాయి. దేశ విభ‌జ‌న‌, ప్ర‌జ‌ల‌ను విభ‌జించడం.. భార‌త ప్ర‌జాస్వామ్య నాడీని క‌లుషితం చేస్తున్నాయి. చాలా దారుణ‌మైన ప‌ద్ధ‌తుల్లో పోతున్నారు. నేను కూడా బాధ‌కు గుర‌య్యాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ రోజు మునుగోడు పోలింగ్ ముగిశాకనే ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న‌తో వెయిట్ చేశాను. మునుగోడులో కూడా వెకిలి ప్ర‌య‌త్నాలు చేశారు. చేతుల్లో పువ్వు గుర్తులు, ఫేక్ ప్ర‌చారాలు చేశారు. పాల్వాయి స్ర‌వంతి త‌న‌ను క‌లిసిన‌ట్టు, కొన్ని టీవీల పేర్లు పెట్టి ప్ర‌చారం చేశారు. ఎల‌క్ష‌న్లు వ‌స్తాయి, పోతాయి. గెలుస్తం, ఓడిపోతం. హుజురాబాద్‌లో ఓట‌మి పాల‌య్యాం. దుబ్బాక‌లో స్వ‌ల్ప మెజార్టీతో ఓడిపోయాం. నాగార్జున సాగ‌ర్‌, హుజుర్‌న‌గ‌ర్‌లో గెలిచాం. ప్ర‌జ‌ల తీర్పును గౌర‌వించాలి. మేం గెలిస్తేనే లెక్క అంటే ప్ర‌జాస్వామ్యం ఎక్క‌డ ఉంట‌ది. రాజ‌కీయాల్లో, ప్ర‌జాజీవితంలో సంయ‌మ‌నం ఉండాలి. చివ‌రికి ఎన్నిక‌ల క‌మిష‌న్ ఫెయిల్ అయింద‌ని ఆరోపించారు. వారిని గెలిపిస్తే ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ మంచిది. ఓడగొడితే ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఫెయిల్ అంట‌రు. బీజేపీ దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తోంది. ఓట‌మిని, గెలుపును ఏదైనా స‌రే స్వీక‌రించాలి. దుర్మార్గ ప‌ద్ధ‌తుల్లో ముందుకు పోతున్నారు. ఉద్య‌మ సంద‌ర్భంలో కూడా మేం ఇంత హేయంగా ప్ర‌వ‌ర్తించ‌లేదు. ఇంత దౌర్భాగ్య‌క‌రంగా వెళ్ల‌లేదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏం జ‌రుగుతుంది. ప్రజాస్వామ్యానికి మూల‌స్తంభాలుగా లెజిస్లేచ‌ర్, కార్య‌నిర్వ‌హ‌క‌ వ్య‌వ‌స్థ‌, న్యాయ వ్య‌వ‌స్థ‌, నాలుగోది ప్రెస్‌. వీట‌న్నింటిని ప‌క్క‌న పెట్టేశారు. ఎవ‌రినైనా బెదిరించ‌గ‌లం, ఏమైనా చేయ‌గ‌లం అని అనుకుంటున్నారు. ఈ ముఠాలు ఏం చేస్తున్నాయి. ఎవ‌రు కూడా ఊహించ‌లేదు అని కేసీఆర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking