ఉచిత విద్యుత్ ఇవ్వాలి

దళిత వాడలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి
*కెవిపియస్ డిమాండ్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

రాష్ట్రంలోని దళిత వాడలకు ఉచిత విద్యుత్ సరఫరా కుల వివక్ష పోరాట సమితి డిమాండ్ చేసింది. గురువారం మిర్యాలగూడ టిఎస్పిడీసిఎల్ డివిజన్ కార్యాలయ ఆవరణలో జరిగిన‌ సదస్సులో వారు డివిజనల్ ఇంజనీర్ ఐతగోని వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించిన అనంతరం సమితి రాష్ట్ర కమిటి సభ్యులు ఆర్ పరశురాములు మాట్లాడుతూ దళితవాడలకు జిఓ 342 ప్రకారం వంద‌యూనిట్ల‌విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని ఇవ్వడంలేదని ఆరోపించారు. దళిత కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా కేరళ, డిల్లీ, ఆంధ్రప్రదేశ్ లలో ఇస్తున్నారని‌తెలంగాణాలో కూడా అమలు చేయాలని‌ కోరారు. దళితవాడలపై విజిలెన్స్ పేరుతో దాడులు తగదన్నారు. కార్యక్రమంలో కోడిరెక్క మల్లయ్య, దైదా దేవయ్య, జనార్థన్, వెంకటయ్య, రాధిక, పాపారావు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking