*మునుగోడులో ముమ్మాటికి టిఆర్ఎస్ దే గెలుపు*
– ఉపఎన్నిక ప్రచారంలో శ్రమించిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు
– టీఆర్ఎస్ కు ఓటేసిన ఓటర్లకుధన్యవాదాలు
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు*
అక్షితప్రతినిధి, మిర్యాలగూడ:
ఢిల్లీ నేతల దురాగతానికి,బిజెపి నేతల అహంకారానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నిక పోరులో గెలుపు ముమ్మాటికీ టిఆర్ఎస్ పార్టీ దే నని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారుగుర్తుపై ఓటు వేసిన ఓటరరు మహాశయులకు ఎమ్మెల్యే భాస్కర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం గత నె రోజులపాటు అవిశ్రాంతంగా అకుంఠిత దీక్షతో తెలంగాణ టీఆర్ఎస్ గెలుపుకోసం ఇంటింటికి తిరిగి ఓటర్లను చైతన్యపరిచిన పార్టీశ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రూ.18,000 కోట్ల కాంట్రాక్టర్ కోసం బీజేపీ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి ఉప ఎన్నికలో ఓటమి తప్పదని భాస్కర్ రావుధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నేతల వద్ద తాకట్టు పెట్టిన రాజగోపాల్ రెడ్డి ఈఉపఎన్నికలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జోస్యం చెప్పారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన పట్ల సంతృప్తి చెంది టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని, అభివృద్ధి పథంలో మరింత ముందుకు దూసుకెళ్తుందన్నారు. మునుగోడును దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఉప ఎన్నికల కోసం గత నెల రోజులుగా పార్టీ తరఫున అవిశ్రాంతంగా శ్రమించిన ప్రతీ ఒక నాయకునికి, కార్యకర్తకి, పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలుతెలియజేశారు. పార్టీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి వచ్చి మునుగోడులో స్థానికంగా ఉంటూ టీఆర్ఎస్ సుపరి పాలనను అక్కడి ప్రజలకు వివరించి పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఇంఛార్జీలకు, వారితో వచ్చిన కార్యకర్తలకి నాయకులకి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకారం అందించిన సోషల్ మీడియా వారియర్లకు పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఎమ్మెల్యే భాస్కర్ రావు తెలిపారు.