*హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించిన న్యాయవాదులు*
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇటీవల నియమితులైన జస్టిస్ భీమపాక నగేష్, జస్టిస్ బొమ్మినేని సుధీర్ కుమార్, జస్టిస్ ఖాజా శరత్ లను న్యాయవాదులు ఘనంగా సన్మానించారు.ఈ ముగ్గురు న్యాయమూర్తులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వారు కాగా,అదే జిల్లాకు చెంది హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న పలువురు సీనియర్ న్యాయవాదులు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలు కప్పి సత్కారం చేశారు. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం జింకల పార్కులో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ,బొమ్మెర రాంమూర్తి,గుండ్లపల్లి శేషగిరిరావు,రవి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.