కౌంటింగ్ కు సర్వం సిద్దం
మునుగోడు, అక్షిత ప్రతినిధి :
భారత ఎన్నికల సంఘం, న్యూఢిల్లీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 93-మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గానికి ఈ నెల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈవిఎమ్ లలో భద్ర పరచబడిన ఓటర్ల నిర్ణయాన్ని తెలిపే ఓట్ల లెక్కింపు 06.11.2022 ఉదయం 8.00 గంటల నుండి ప్రారంభమవుతుంది.

*లెక్కింపు ప్రక్రియ*:
# నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 241805.
# .తేది .03.11.2022న పోల్ అయిన మొత్తం ఓట్లు 225192. ఇందులో పోస్టల్ బాలేట్ ద్వారా వచ్చిన ఓట్లను కలుప లేదు. ఈవిఎం లలో జరిగిన పోలింగ్ 93.13% గా నమోదయ్యింది.
# 80+ వృద్దులు మరియు దివ్యాంగుల నుండి మొత్తం 739 పోస్టల్ బ్యాలెట్ కి ధరకాస్తులు వస్తె అందులో 686 వచ్చాయి మంది పోస్టల్ బాల్లెట్ ను వినియోగించుకున్నారు.
# తేది 04.11.2022 నాటికి సాయుధ బలగాలకు (సర్వీస్ ఓటర్స్) సంబందించి పోస్టల్ బ్యాలట్, మొత్తం 50కి గాను 6 అందినవి.
# నల్గొండలోని అర్జాల బావిలోని తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
# ఓట్ల లెక్కింపు తేది 06.11.2022న ఉదయం 08.00 గంటలకు ప్రారంభమవుతుంది.
# పోల్ చేయబడిన EVMS (A&B కేటగిరీ) ఉన్న స్ట్రాంగ్ రూమ్ ను తేది 06.11.2022 ఉదయం 7.30 గంటలకు ఎన్నికల కమీషన్ పరిశీలకులు, పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఎలక్షన్ ఏజెంట్ల సమక్షంలో తెరవబడుతుంది.
# కమిషన్ సూచనల మేరకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపడతారు.
# పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం మొత్తం 2 టేబుల్స్ ఏర్పాటు చేయబడ్డాయి
# పోస్టల్ బ్యాలెట్‌తో పాటు సర్వీస్ ఓటర్ల ఓట్లను ఎన్నికల కమీషన్ యొక్క ఈటీపీబీఎస్ సాఫ్టువేర్ ద్వారా లెక్కింపు కూడా చేపడతారు.
# 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నారు.
#ఓట్ల కౌంటింగ్ మొత్తం 21 టేబుల్ లను కమిషన్ ఆమోదంతో ఏర్పాటు చేయబడ్డాయి.
# మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు మొత్తం 21 టేబుల్లలో మొత్తం 14 రౌండ్లు (14 పూర్తి రౌండ్లు, 294 పోలింగ్ స్టేషన్లు) మరియు 15వ రౌండ్ 4 టేబుల్లలో జరుగుతుంది.
# EVM కౌంటింగ్ పూర్తయిన తర్వాత, ఎన్నికల నిబంధనావలి 1961 యొక్క నియమం 56 (D) ప్రకారం లెక్కించుటకు అనుమతించిన మరియు కంట్రోల్ యూనిట్ ఫలితాన్ని ప్రదర్శించని పోలింగ్ స్టేషన్‌లను మినహాయించి డ్రా పద్దతి ద్వారా తప్పనిసరిగా 5 పోలింగ్ స్టేషన్ల VVPAT ల స్లిప్‌లను VCB (VVPAT కౌంటింగ్ బూత్) నందు లెక్కించబడును .
# 150 మంది సీటింగ్ కెపాసిటీతో ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా రెండింటికీ ప్రత్యేక హాలు ఏర్పాటు చేయబడింది .
# ఓట్ల లెక్కింపు రోజు కోసం మొత్తం 250 మంది సిబ్బందిని నియమించటమైనది. వారిలో 100 మంది సిబ్బందిని కేవలము ఓట్ల లెక్కింపు కోసము మరియు 150 మంది సిబ్బందిని ఇతర కార్యకలాపాల కోసం నియమించటమైనది.