యాదవుల ఐక్యతతోనే రాజ్యాధికారం సిద్ధిస్తుంది
-యాదవ వన సమారాధన కార్యక్రమంలో అఖిల భారతయాదవ మహాసభ నాయకులు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
యాదవుల ఐక్యతతోనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని అది కేవలం అఖిలభారతయాదవ మహాసభ తోనే సాధ్యపడుతుందని ములాయం సింగ్ యాదవ్ లాలు ప్రసాద్ యాదవ్ బిందెశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ లాంటి ఎంతో మంది రాజకీయ నాయకులు అఖిలభారత యాదవ మహాసభ అండదండలతో ముఖ్యమంత్రులు అయ్యారని యాదవనసమారాధన కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన యాదవులనుద్దేశించి అఖిల భారత యాదవ మహాసభ నాయకులు ముఖ్య అతిథులు రాష్ట్ర యాదవ యువజన అధ్యక్షులు రమేష్ యాదవ్ ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్ పేర్కొన్నారు.జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ యాదవ వన సమారాధన కార్యక్రమం ద్వాపరయుగం నుండి ప్రారంభించబడిందని యాదవుల పేరుతో ఐక్యత వల్ల పదవులు తెచ్చుకున్న కొంతమంది యాదవుల ఐక్యతను దెబ్బతీయాలనుకోవడం 100సంవత్సరాల గొప్ప చరిత్రకలిగిన అఖిల భారత యాదవ మహాసభ ను నిందించడం పాలు తాగిన తల్లి రొమ్మును గుద్దటంతో సమానమని దమ్ము ధైర్యం పౌరుషానికి మారుపేరైన యాదవులు ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని హితవు పలికారు.గొర్రెలకు బదులు నగదు బదిలీచేయాలని ఖమ్మం కార్పొరేషన్ లో గొర్రెలకు బదులుగా పాడి గేదెలు ఇప్పించాలని ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా డీసిసిబి రుణాలను మంజూరు చేయాలని 50 సంవత్సరాలు నిండిన ప్రతి గొర్రెల కాపరికి ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరికి పది లక్షల నష్టపరిహారం ప్రకటించాలని గొర్రెల కాపరులకు షెడ్లు వెంటనే మంజూరు చేయాలని మాంసప్ మార్కెట్లో గొర్రెల సంఘాలకు అప్పగించాలని నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో వాకదాని పుల్లారావు లోకేష్ యాదవ్ లోడిగా వెంకన్న డాక్టర్ అల్లిక వెంకటేశ్వర్లు లిక్కి కృష్ణారావు బండి రామ్మూర్తి చింతలచెరువు లక్ష్మి విజయలక్ష్మి పుచ్చకాయల వీరభద్రం ఎంపీపీ గోసు మధు కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల మధు కార్పొరేటర్ దొడ్డ నగేష్ దుబాకుల శ్రీనివాస్ శివరాం యాదవ్ పొదిలి సతీష్ బండారు ప్రభాకర్ తెల్లబోయిన రమణ తదితరులు పాల్గొన్నారు.