గ్రామాల్లో బిజెపి జెండా రెపరెపలు
పాల్గొన్న ఎమ్మెల్యేఈటెల రాజేందర్
రాజేంద్రనగర్, అక్షిత ప్రతినిధి:
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బిజెపి పార్టీ దూకుడును పెంచింది.మొన్నటి వరకు మిన్నకుందిన ఆ పార్టీ ప్రస్తుతం దూకుడును పెంచింది.మొన్న మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి పాలైన బిజెపి రాష్ట్రంలో గెలుపుపొందలని కేంద్రంనుంచి అందిన సంకేతాల మేరకు దుకుడుని ప్రదరధిస్తుంది.
రాజేంద్రనగర్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూ బిజెపి పార్టీని బలోపేతం చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు.ఈమేరకు రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలంలో పలు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను నియోజకవర్గ బిజెపి నాయకులతో కలిసి ఘణ స్వాగతం పలకడం జరిగిందని బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ తెలిపారు.అనంతరం శంషాబాద్ మండలంలోని బుక్క వేణుగోపాల్ పలు పార్టీలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులను,ముఖ్య నాయకులను బిజెపి పార్టీలోకి ఈటల రాజేందర్ సమక్షంలో చేర్చుకోవడం జరిగిందని అన్నారు.పార్టీ బలోపేతం,కెసిఆర్ అహంకారాన్ని దించడానికి ప్రతి కార్యకర్త నిబ్బత్తతో పని చేయాలనీ కార్యకర్తలతో తెలిపి,జెండా ఆవిష్కరణచేశారు.రాజేంద్రనగర్ నియోజకవర్గ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపిన ఈటల రాజేందర్ కు కృతఙ్ఞతలు తెలియజేసిన బుక్క వేణుగోపాల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహ రెడ్డి, శంషాబాద్ మండల బిజెవైఎమ్ అధ్యక్షుడు బుక్క ప్రవీణ్ కుమార్,కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి,ననవాళ్ళ కుమార్ యాదవ్,సర్పంచి సునిగంటి సిద్ధులు,మల్లేష్ యాదవ్, మెండే కుమార్ యాదవ్,పెద్దసంఖ్యలో పార్టీ ముఖ్యనేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Post