*మనసున్న సీఎం కేసీఆర్*
అక్షితప్రతినిధి, వేములపల్లి :
వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన రేవెల్లి రాములు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని రావులపెంట ఎంపీటీసీ నంద్యాల శ్రీరాంరెడ్డి మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు దృష్టికి తీసుకుని వెళ్లారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు రేవెల్లి రాములు చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ సహయనిది నుంచి రూ 2 లక్షల 50 రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించారు. ఈ సందర్భంగా రేవెల్లి రాములు తోపాటు కుటుంబ సభ్యులు అపదసమయంలో అక్కున చేర్చుకొని ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.