‘ఎన్బీఆర్ ‘ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులకు అన్నప్రసాద వితరణ
* నల్లమోతు సిద్దార్ధ మనో సంకల్పం దృఢమైనది
* 21వ రోజు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సాధినేని స్రవంతి, శ్రీనివాసరావు దంపతులు, ఇతర ప్రజాప్రతినిధులు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆదివారం 21వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమాన్ని 45 రోజుల పాటు కొనసాగించనున్నట్టు సిద్దార్ధ తెలిపారు. అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లను చేయడంతో పాటు అయ్యప్ప దీక్ష చేపట్టిన మాలధారులకు నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తి భావంతో నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని అన్నారు. 21వ రోజు నిర్వహించిన పూజా కార్యక్రమాలలో 6వ వార్డు- ఇందిరమ్మ కాలనీ కౌన్సిలర్ సాధినేని స్రవంతి, శ్రీనివాస రావు దంపతులు పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామి మాలధారులకు అన్నప్రసాద వితరణ చేశారు. నల్లమోతు సిద్దార్ధ చేపట్టిన కార్యక్రమాల్లో ఇదో బృహత్ కార్యక్రమమని అభినందించారు. సిద్దార్ధ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువయ్యారని, ఆయన మనో సంకల్పం చాలా ధృడమైనదని వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు పెండ్యాల పద్మ, నాయకులు పత్తిపాటి నవాబ్, బాల సత్యనారాయణ, బాల శ్రీనివాస్ నాయుడు, పున్న నాయక్, ఉబ్బపల్లి శంకర్, వరకాల సురేష్, గురు స్వాములు, తదితరులు పాల్గొన్నారు.