గ్రంధాలయాలు విజ్ఞాన బండాగారాలు
-మంత్రి పువ్వాడ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
గ్రంధాలయాలు ప్రతిఒక్కరికీ విజ్ఞానాన్ని పంచే విజ్ఞాన భాండాగారాలు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.ఈ నెల 14వ తేదీ నుండి 20 వరకు జరుగుతున్న 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ముగింపు రోజు గ్రంధాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమా మహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సాంకేతిక యుగంలో గ్రంథాలయాలు మరుగున పడిపోకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక నూతన గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం మరియు ఆధునికీకరణ చేయడం జరిగిందన్నారు.శిధిలావస్థ దశలో ఉన్న జిల్లా గ్రంధాలయ భవనంను ఆధునీకరించి వేల మంది విద్యార్థులకు విజ్ఞాన్ని అందించేందుకు తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.ఒకనాటి పరిస్థితులను గుర్తు చేశారు. గ్రంధాలయం పై ఆధార పడ్డ ప్రతి విద్యార్థికి మంచి విజ్ఞానాన్ని అందించాలనే ఆకాంక్షతో వారికి సకల సౌకర్యాలు కల్పించామని వివిధ పోటీ పరీక్షలకు సిద్దం అయ్యే అభ్యర్థులకు ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచామని అన్నారు.దూర ప్రాంతం నుండి వచ్చే విద్యార్థులకు అభ్యర్థులకు ఇక్కడే రూ.5 కే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా భోజన సౌకర్యం కల్పించామని వివరించారు.మన సమాజం విజ్ఞానదాయక సమాజంగా ఎదగాలంటే గ్రంధాలయాలు అవసరమని మన గ్రంధాలయాలను మనం కాపాడుకోవడం మన బాధ్యత, అవసరం అన్నారు.పౌరులందరూ రోజూ కనీసం ఒకగంటసేపు గ్రంధాలయంలో పాఠనాన్ని సాగించాల్సిందిగా కోరుతున్నానని అన్నారు.ఈ కార్యక్లమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ గ్రంధాలయ సెక్రటరీ మంజువాణీ సిబ్బంది రాజు ఇమాం జే బాస్కర్ అఖిల్ కనకవల్లి సుమలత బాబు తదితరులు ఉన్నారు.