తిప్పనకు పదవి పట్ల నవీన్ రెడ్డి హర్షం
ఉద్యమ నేత తిప్పనకు పట్టం
రెడ్డికి సముచిత స్థానంతో కేసిఆర్ కు కృతజ్ఞతలు
టిఆర్ఎస్ రాష్ట్ర నేత నిమ్మల నవీన్ రెడ్డి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
సీనియర్ టిఆర్ఎస్ లీడర్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ సింహరెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి వరించడం పట్ల టిఆర్ఎస్ రాష్ట్ర నేత నిమ్మల నవీన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఓ రైతు బిడ్డకు ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి సీఎం కేసిఆర్ కట్టబెట్టడం పట్ల కేసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి నల్గొండ జిల్లా గులాబీ దళపతిగా విశిష్ఠ సేవలందించిన విజయ సింహరెడ్డికి సముచిత స్థానం కల్పించడం అభినంద నీయమన్నారు. తెలంగాణ ఉద్యమ సంగ్రామంలో జిల్లా గులాబీ దళపతిగా ఎన్నో సేవలందించారని ఆయన గుర్తు చేశారు. టిఆర్ఎస్ కష్ట కాలంలోనే పార్టీ ప్రగతికి కృషి చేయడంతో పాటు గులాబీ రాష్ట్ర దళపతి, ప్రస్తుత సీఎం కేసిఆర్ తో కలిసి ఎన్నో ఉద్యమాలు సాగించిన ధీరుడు విజయ సింహుడన్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలో లిఫ్ట్ ల పరిరక్షణకు నాడు ఉద్యమ నేతగా కేసిఆర్ సాగించిన సంగ్రామంలో సైనికుడిగా కేసిఆర్ వెంట నడయాడిన విజయ సింహరెడ్డికి ఉద్యమ నేపథ్యం ఉందన్నారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేగా తన తండ్రి తిప్పన కృష్ణారెడ్డి, విజయసింహరెడ్డిలు కూడా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించడం ఆయా పరిధిలో ఎన్నో ప్రగతి పనులు చేపట్టడంతో నియోజక వర్గ ప్రజలందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని చిరపరిచితుడుగా నిలుస్తున్నారని నవీన్ రెడ్డి తెలిపారు. గతంలో మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, ప్రసుతం మిర్యాలగూడ జడ్ పిటిసిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ విశిష్ఠ సేవలందిస్తున్నారన్నారు. విజయ సింహ రెడ్డిని సీఎం కేసిఆర్ పేరు పెట్టి పిలిచే అత్యంత చనువు ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టి తగిన గుర్తింపును ఇవ్వడంతో తిప్పన శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొందన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా సేవలందిస్తూ ఇండస్ట్రీస్ ను పరిరక్షిస్తూనే రైతులకు మరింత సేవలందించి పదవికి మరింత వన్నె తెస్తారని నవీన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.