అన్న ప్రసాద వితరణ



ఎన్ బి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

నల్లమోతు భాస్కర్ రావు (ఎన్బీఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఆ సంస్థ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నిర్వహిస్తున్న మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం గురువారం 32 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఉబ్బపల్లి మధుసూదన్ రావు, వేముల దుర్గారావు పాల్గొని అయ్యప్పస్వాములకు అన్నవితరణ చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు బాసాని గిరి, పునాటి లక్ష్మీనారాయణ, కందగట్ల అశోక్, ఆయిల్ శ్రీను, తిరుమలగిరి వజ్రం, కునాల గోపాలకృష్ణ, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఏలుగుబెల్లి నాగరాజు, బోయ సైదులు, నల్లగంతుల నాగభూషణం, కడియం సైదులు, సచిన్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking