
సీఎం సహాయనిధి పేదలకు వరం
* ఆపద్బాంధవుడు ‘కేసీఆర్’
నల్లమోతు సిద్దార్ధ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్ ) నిరుపేదలకు వరమని యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ కొనియాడారు. బుధవారం హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని నల్లమోతు భాస్కర్ రావు నివాసంలో మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన మూడు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన ఎల్ఓసీ చెక్కులను యువనేత సిద్దార్ధ పంపిణీ చేశారు. మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన పద్మ, అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన వెంకన్న, మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంకు చెందిన నందకిషోర్ గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆయా గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు చికిత్స నిమిత్తం సీఎం సహయనిధి నుంచి నందకిషోర్ కు రూ.2,50,000/-, పద్మకు రూ.2,00,000/-, వెంకన్నకు 2,50,000/- మొత్తం రూ.7,50,000/- మంజూరు చేయించారు. ఎల్ఓసీ చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేసిన తర్వాత నల్లమోతు సిద్దార్ధ మాట్లాడారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని అన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. సీఎం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని నల్లమోతు సిద్దార్ధ తెలిపారు.